మేడిపండు చందంగా..
బడ్జెట్ మేడిపండు చందంగా ఉంది. ఈ ప్రభుత్వంలో వరుసగా ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలోనూ ప్రజల్ని మోసం చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పెన్షన్ తదితర వాటి విషయంలో మొండిచేయి చూపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి బడ్జెట్ భంగం కలిగించింది. పీఆర్‌సీ, ఐఆర్, సీపీఎస్ ఊసు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు కొత్తగా సంక్షేమం లేదు. మహిళా సంఘాలనూ పట్టించుకోలేదు.
– వంగల దాలినాయుడు, డీసీసీ అధ్యక్షులు, పార్వతీపురం మన్యం జిల్లా
●


