పరిశుభ్రత కోసం వీధి కమిటీలు : సబ్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత కోసం వీధి కమిటీలు : సబ్‌ కలెక్టర్‌

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

పరిశు

పరిశుభ్రత కోసం వీధి కమిటీలు : సబ్‌ కలెక్టర్‌

పాలకొండ: నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ కోసం వీధి కమిటీలు ఏర్పాటు చేయాలని సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ సూచించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన కోసం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని వీధుల్లో పర్యటించిన ఆయన ఎక్కడికక్కడే చెత్త పేరుకు పోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీధుల్లో చెత్త పారబోయకుండా అవగాహన కలిగించేందుకు ప్రతి వీధికి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలు ప్రతి రోజు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్నా క్యాంటిన్‌లో ఆహారం పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. అక్కడ మరుగుదొడ్లు నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు సక్రమంగా ఉంచాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట నగర పంచాయతీ సిబ్బంది అంటున్నారు.

బాల్య వివాహాల

విముక్తి రథం ప్రారంభం

గుమ్మలక్ష్మీపురం: బాల్య వివాహాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి దామోదరరావు అన్నారు. అప్‌హోల్డ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన బాల్య వివాహాల విముక్తి రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకం చేసి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అంతా చేయిచేయి కలపాలని పిలుపునిచ్చారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు నిబద్ధతతో ముందుకు రావాలన్నారు. ఈ ప్రచార రథం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎక్కడైన చట్ట వ్యతిరేక వివాహాలు జరిగితే చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 121లకు సమాచారం ఇవాలన్నారు.

పరిశుభ్రత కోసం   వీధి కమిటీలు : సబ్‌ కలెక్టర్‌ 1
1/1

పరిశుభ్రత కోసం వీధి కమిటీలు : సబ్‌ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement