మొదటి సంతకం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మొదటి సంతకం అమలు చేయాలి

Feb 11 2026 8:14 AM | Updated on Feb 11 2026 8:14 AM

మొదటి

మొదటి సంతకం అమలు చేయాలి

మొదటి సంతకం అమలు చేయాలి మంత్రి మాటకు విలువ లేదని రుజువైంది.

ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందుతుండడం బాధాకరం. ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తల నియామానికి మొదటి సంతకం చేసిన మంత్రి సంధ్యారాణి రెండేళ్లుగా తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కలిగేలా.. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసానిచ్చేలా ఆరోగ్య కార్యకర్తలను నియమించాలి.

–ఎ.గంగారావు, ఎస్‌ఎఫ్‌ఐ మండల

కార్యదర్శి, గుమ్మలక్ష్మీపురం

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తల నియామానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన మొదటి సంతకానికి రెండేళ్లు కావస్తోంది. అయినా కార్యాచరణ జరగకపోవడంతో కూటమి ప్రభుత్వంలో మంత్రి మాటకు ఏ మాత్రం విలువ లేదని స్పష్టం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది గిరిజన విద్యార్థుల మరణాలు జరిగాయి. మృతులైన విద్యార్థుల కుటుంబాలకు పరిహారమైనా ఇవ్వకపోవడం బాధాకరం. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదు. రక్షణ లేకుండా పోయింది.

–పాలక రంజిత్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ

సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

మొదటి సంతకం  అమలు చేయాలి  
1
1/1

మొదటి సంతకం అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement