ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు

ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు

‘పది’ పరీక్షలపై ఉపాధ్యాయుల సూచన

సాధన చేస్తే భౌతిక శాస్త్రం సులభం..

సాధన చేస్తే విద్యార్థులకు బౌతిక శాస్త్రం సులభమవుతుంది.ప్రశ్నపత్రం మొత్తం మీద విషయ అవగాహన అంశాలను వివరించడం, కృత్యాలను రాయడం, ప్రశ్నించడం, కారణాలు తెలపడం,ఉపయోగాలు రాయడం, ప్రమాణాలు రాయడం, పటాలు గీయడం తదితర విద్యాప్రమాణాలను సాధన చేస్తే విద్యార్థులందరూ దాదాపు 70 శాతం మార్కులు తెచ్చుకోవచ్చు. రసాయనిక చర్యల సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, కార్బన్‌, దాని సమ్మేళనాలు, మానవుని కన్ను రంగుల ప్రపంచం,కాంతి పరివర్తనం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.

– ఎం.శ్రీనివాసరావు, భౌతికశాస్త్రం స్కుల్‌ అసిస్టెంట్‌

తెలుగు తెలుసుకుంటే సులువు

ప్రశ్నపత్రం సరళిపై అవగాహనతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. పద్యం,గద్యం, ఉపవాచకం నుంచి ప్రశ్నలు ఉంటాయి. కరపత్రం, లేఖ, సంభాషణలో ఏదో ఒక అంశంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు.అలాగే అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి–వికృతులు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు 22 నుంచి 32 వరకు ప్రశ్నలు భాషాంశాలపై ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రతిరోజూ క్లాస్‌ రూంలో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్‌ చేయడం ఎంతో ఉపకరిస్తుంది.చేతి రాత ఆకట్టుకునేలా ఉండాలి.

– పి.గంగ ,తెలుగు పండిట్‌, ఉన్నత పాఠశాల, రామభద్రపురం

రామభద్రపురం: పదో తరగతి ప్రతి విద్యార్ధి జీవితంలో కీలకం. పదిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య,ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విద్యార్ధులకు మార్చి 16 నుంచి పది పబ్లిక్‌ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలుచేస్తోంది. విద్యార్థులు అత్యధిక మార్కుల సాధన కోసం ఆయా సబ్జెకుకు సంబందించిన సిలబస్‌ను,పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకుని పటిష్ట ప్రిపరేషన్‌కు ప్రణాళిక రూపొందించుకుంటే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్‌ పూర్తిచేసి ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు రోజూ టెస్టులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు పొందాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను పలువురు సబ్జెక్టు నిపుణులు ఇలా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement