నేడు ప్రజా సమస్యల వేదిక రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల వేదిక రద్దు

Feb 9 2026 7:53 AM | Updated on Feb 9 2026 7:53 AM

నేడు ప్రజా సమస్యల వేదిక రద్దు

నేడు ప్రజా సమస్యల వేదిక రద్దు

రెవెన్యూ సిబ్బంది బాధ్యతగా పని చేయాలి

పార్వతీపురం: జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలు రద్దయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించే సమీక్షా సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌న్‌.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులందరూ వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున..జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో వినతుల స్వీకరణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి అర్జీదారులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని కలెక్టర్‌ కోరారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో కూడా నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ రద్దు

సీతంపేట: ఐటీడీఏలో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను రద్దు చేస్తున్నట్లు పాలకొండ సబ్‌కలెక్టర్‌ పవార్‌స్వప్నిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

11, 12 తేదీలలో వినియోగదారుల హక్కులపై సమావేశాలు

పార్వతీపురం: ఈనెల11,12 తేదీలలో పార్వతీపురంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు క్యాప్‌ కో జిల్లా కన్వీనర్‌ శ్రీహరి ఆదివారం తెలిపారు. భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్‌)పై అవగాహన కల్పించేందుకు కన్స్యూమర్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కన్స్యూమర్‌ ఆర్గనైజేషన్స్‌(క్యాప్‌కో)లు సంయుక్తంగా అవగామన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11న ఉదయం పట్టణంలోని ప్రభుత్వ బ్రాంచ్‌ పాఠశాలలో, మధ్యాహ్నం 3 గంటలకు కొత్తవలసలోని కేపీఎం ఉన్నతపాఠశాలలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 12న ఉదయం భాస్కర్‌ డిగ్రీ కళాశాలలో, మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రేగిడి: రెవెన్యూ సిబ్బంది మరింత బాధ్యతగా పని చేయాలని చీపురుపల్లి ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ డి.ప్రమీలాగాంధి అధికారులకు సూచించారు. మండలంలోని పారంపేట, మునకలవలస, ఉణుకూరు గ్రామ సచివాలయాలను ఆదివారం ఆమె సందర్శించారు. ఆయా గ్రామాల్లో డ్రాఫ్ట్‌ పట్టాదారు పాసు పుస్తకాల ను తనిఖీ చేశారు. రైతులకు సంబంధించిన సమ స్యలు ఉంటే తక్షణమే పరిష్కరించి పాసు పుస్తకాల్లో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని తహసీ ల్దార్‌ ఐ.కృష్ణలతకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement