జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు గుర్ల యువకుడు
గుర్ల: మండల కేంద్రానికి చెందిన పొన్నాడ ఉమామహేశ్వరరావు జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికై నట్లు కుస్తీ కోచ్ కర్రోతు జగదీశ్ ఆదివారం తెలిపారు. గత ఏడాది గుజరాత్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఉమామహేశ్వర రావు ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. కుస్తీలో రాణించడంతో రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పెడరేషన్ కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాధ్ ఈనెల12 నుంచి 14 వరకు ఈపోటీలు జరగనున్నాయి. ఉమామహేశ్వరరావు నెల్లిమర్లలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
రాజాం సిటీ: మండల పరిధి అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముళ్ల శంకరరావు (34) గడ్డిమందుతాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న శంకరరావు కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 7న ఉదయం తన భార్య అశ్విని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగేశాడు. భర్త వాంతులు చేసుకుంటుండడాన్ని ఇంటికి వచ్చిన భార్య గమనించి ఆరా తీసింది. గడ్డిమందు తాగినట్లు తెలపడంతో వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
విజయనగరం క్రైమ్: నగరంలోని ఇప్పిలివీధికి చెందిన పరంధాం అనే వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదైనట్లు హెడ్‌కానిస్టేబుల్ అంజిబాబు ఆదివారం తెలిపారు. బీపీఎం పాఠశాల వద్ద నివాసం ఉంటున్న పరంధాం..ఈ నెల 3వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, ఐదు రోజులుగా ఆయన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి, గాలించడం జరుగుతోందన్నారు.
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు గుర్ల యువకుడు
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు గుర్ల యువకుడు


