రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని గుణపూరుపేట గ్రామం సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ లే అవుట్ వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి(41) దుర్మరణం చెందాడు. మృతు డి భార్య సరోజిని ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి గుణుపూరుపేట మీదుగా స్వగ్రామం రెల్లివలస వస్తుండగా ప్రమాదం జరిగింది. శనివా రం రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ తనతో ఫోన్ మాట్లాడారని, అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని భార్య సరోజిని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున తన భర్త మురళి గుణుపూరుపేట వద్ద స్తంభాన్ని మోటార్ సైకిల్‌తో ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలై మరణించినట్లు తనకు సమాచారం రావడంతో వెళ్లి చూసే సరికి తీవ్రగాయాలతో మరణించి ఉన్నాడని సరోజిని ఫిర్యాదులో పేర్కొంది.
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి సమీ పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన ప్రమి దల శ్రీనివాసరావు (56) ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసరావు తన కుమార్తె కన్యసికతో కలిసి ద్విచక్రవాహనంపై రాజాం వచ్చి స్వగ్రామం తిరుగు ప్రయాణమయ్యాడు. పొగిరి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో ముందున్న లారీని తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో రోడ్డుపై పడిన ఇద్దరూ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో కాలికి గాయమైన కుమార్తె చికిత్స పొందగా, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాపార్వతి, మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


