బక్కుపేట పొలాల్లో ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని బక్కుపేట పొలాల్లో శనివారం ఏనుగులు సంచరిస్తున్నాయి. ఉదయం మక్కువ మండలం కంచివానివలస, రేజేరు, బక్కుపేట గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో సంచరించిన ఏనుగులు గుంపు రాత్రి సమయానికి బక్కుపేట మెట్ట భూమిలోకి చేరుకున్నాయి. అంతకు ముందు బల్లకృష్ణాపురం గ్రామంలో సంచరించిన ఏనుగులు నాలుగు ఎకరాల్లో ఉన్న పామాయిల్ మొక్కలను ధ్వంసం చేశాయి.
గొట్టాపు సింహాచలం, విజయ, సీహెచ్ లక్ష్ములకు చెందిన పొలాలను ధ్వంసం చేశాయి. బల్ల వెంకటరమణకు చెందిన రబీ వరి ఉబాలు వేసేందుకు సిద్ధంగా ఉంచిన వరి నారుమడిలో నారును ధ్వంసం చేశాయి.


