ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
బ్యానర్...
సాక్షి, పార్వతీపురం మన్యం :
‘ప్రభుత్వ అనుమతి లేకుండా మత్తు కలిగించే పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..’ ఇదీ ఎకై ్సజ్ అధికారులు చెబుతున్న మాట. ఇది ప్రకటనలకే పరిమితమవుతోంది. లెక్కల కోసం దాడులు.. ఘటన వెలుగులోకి వచ్చినప్పుడే తనిఖీలు చేసి మమ అనిపించేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడిలో జీలుగుకల్లు తాగి పది మందికిపైగా అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత విరివిగా రెండు రోజులపాటు తనిఖీలు చేశారు. ఈ సమయంలోనే గత మంగళవారం సాలూరు మండలంలోని తుండ గ్రామ సమీప తోటలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 30 లీటర్ల జీలుగు కల్లును గుర్తించి ధ్వంసం చేశారు. జీలుగుకల్లు సహజంగా చెట్టు నుంచి లభించేవి అయినప్పటికీ.. తాటి, ఈత కల్లులా విక్రయించడానికి చట్టబద్ధమైన అనుమతులు లేవు. దీనికితోడు వ్యాపారులు కక్కుర్తితో కల్తీ చేస్తున్నారు. ఫలితంగా అవి విషపూరితంగా మారుతున్నాయి.
ఎక్కడికక్కడే సారా తయారీ..
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొండలపై సారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు.. గిరిజనులనే పనివారుగా చేసుకుని, కొండ ప్రాంతాల్లో గుట్టుగా సారా తయారీ చేస్తున్నారు. దీన్ని సరిహద్దులోని గిరిజన, మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. మద్యం ధర కంటే సారా, జీలుగు కల్లు తక్కువ మొత్తానికి లభిస్తుండడం.. మత్తు ఇస్తుండడంతో మైదాన ప్రాంతం వారు కూడా వీటిని రహస్యంగా విక్రస్తు యిన్నారు. పార్వతీపురం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో సైతం జోరుగా సారా ప్యాకెట్ల వ్యాపారం సాగుతుండడం గమనార్హం. జిల్లాలో 2024లో సారా తయారీ, విక్రయంపై జరిపిన దాడుల్లో 1,045 కేసులు నమోదయ్యాయి. 17,603 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 2025లో 287 కేసులు నమోదు కాగా.. 3,548 లీటర్ల సారాను నాశనం చేశారు. ఎకై ్సజ్ అధికారులు అడపాదడపా దాడులు జరుపుతూ.. సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేస్తున్నా.. ప్రయోజనం ఉండటం లేదు.
జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా జీలుగు కల్లు సేకరిస్తుంటారు. ఈ కల్లు సహజసిద్ధమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇది రసాయనాలు లేని పానీయం. గిరిజనుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి, కొన్ని పదార్థాలు కలిపి మరలా విక్రయిస్తుంటారు. ఇలా కల్తీ చేయడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటి విక్రయం నిషేధమే అయినప్పటికీ.. నిషాకు అలవాటు పడిన గిరిజనులు దీనిని అధికంగా వినియోగిస్తుంటారు. మైదాన ప్రాంతాల నుంచి కూడా వెళ్లి ఎక్కువగా సేవిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇది తాగితే ఆరోగ్యమని గిరిజనులు భావిస్తుంటారు. తక్కువ ధరకే లభిస్తుండడంతో ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు.
మత్తులో గిరిజనం
విరివిగా జీలుగు కల్లు వినియోగం
సహజసిద్ధమైనప్పటికీ.. వ్యాపారుల కక్కుర్తితో కల్తీ
ఎక్కడికక్కడ నాటుసారా తయారీ, విక్రయాలు
మొద్దు నిద్రలో ఎకై ్సజ్ సిబ్బంది
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026


