పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు

Jan 25 2026 7:24 AM | Updated on Jan 25 2026 7:24 AM

పార్ట

పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు

పాలకొండ: పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు స్పష్టం చేశారు. పాలకొండలోని ఏఎంజీ కన్వెన్సన్‌ హాల్‌లో శనివారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఆవశ్యకతను వివరించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు సరగడాన చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతీ నాయకుడు, కార్యకర్త తీసుకోవాలన్నారు. కూటమి నాయకులు నుంచి వచ్చే బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు 1
1/1

పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement