తపాలా బీమా పథకాలపై అవగాహన తప్పనిసరి
విజయనగరం టౌన్: తపాలా బీమా పథకాలపై ఉద్యోగులందరూ అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వీఎస్.జయశంకర్ సూచించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీసమావేశమందిరంలో శుక్రవారం ఉద్యోగులకు బీమా సంకల్ప్ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో నిర్దేశించిన కోటి రూపాయల ప్రీమియానికి ఇప్పటివరకూ రూ.70లక్షలకు పైగా టార్గెట్ సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తపాలా ఉద్యోగుస్తులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తపాలా బీమా సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా తమ సేవలను విస్తృతం చేయాలని సూచించారు కార్యక్రమంలో విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సహాయ సూపరింటెండెంట్‌లు జీవీ.రమణారావు, టి.సుందరనాయుడు తదితరులు పాల్గొన్నారు.


