ఘనంగా పెన్షనర్స్ డే
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని బుధవారం స్థానిక సంఘం భనవనంలో ఘనంగా నిర్వహించారు., జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రపాండా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు దాటిన పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను సంఘం ఘనంగా సత్కరించింది. అనంతరం పలువురు మాట్లాడుతూ పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కలిపి బకాయిలు ఉన్న సుమారు రూ.35 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పి.రామచంద్రరావు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి ఎల్వీ యుగంధర్, జిల్లా కార్యదర్శి బలివాడ బాల భాస్కర్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి పక్కి భూషణ్‌రావు, పెన్షనర్స్ ఎస్‌టీఓ నూకరాజు, కోశాధికారి సొంటి కామేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, డ్రైవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామారావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
100 మంది పెన్షనర్లకు సన్మానం
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా పెన్షనర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా 100 మంది వృద్ధ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు వి.సూర్యనారాయణ, కార్యదర్శి త్రినాఽథ్ ప్రసాద్‌తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లావ్యాప్తంగా పెన్షనర్లు హాజరయ్యారు.


