స్వచ్ఛగ్రామంగా అంటిపేట రూపుదిద్దుకోవాలి
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ స్వచ్ఛగ్రామంగా రూపుదిద్దు కోవాలని సబ్‌కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. ప్రతిపాదిత స్వచ్ఛగ్రామం అంటిపేటను సబ్‌కలెక్టర్ ఆర్ వైశాలి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో ఎక్కడా చెత్తకనిపించరాదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుద్ధి చేసుకుని స్వచ్ఛమైనగ్రామంగా తీర్చి దిద్దుకోవాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్ ప్రసాద్, సర్పంచ్ బి.తిరుపతిరావు, ఎంఈఓ సూరిదేముడు,ఇంజినీరింగ్ అధికారులు, గ్రామపెద్దలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
కోటసీతారాంపురంలో మౌలికవసతుల కల్పన
మండలంలోని కోటసీతారాంపురం గ్రామంలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం నిమిత్తం సబ్‌కలెక్టర్ ఆర్. వైశాలి బుధవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. గ్రామాన్ని వ్యవసాయ, ఆర్ధిక,వాణిజ్య, విద్యాపరంగా అభివృద్ది పధకంలో నడిపించడానికి అవసరమైన వసతులు కల్పించడానికి వనరులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రైతు సేవాకేంద్రం ఆవరణలో గ్రామ పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల నుంచి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అభిప్రాయాలను సేకరించారు.


