కోటి గళాల గర్జన | - | Sakshi
Sakshi News home page

కోటి గళాల గర్జన

Dec 16 2025 4:22 AM | Updated on Dec 16 2025 4:22 AM

కోటి

కోటి గళాల గర్జన

–10లో మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 కోటి గళాల గర్జన ఇవెక్కడి రేషన్‌ కష్టాలు ‘బాబూ’ ప్రభుత్వ సేవలు మరింత విస్తృతం గోరంత పనికి.. కొండంత ప్రచారం ●చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది ●రెడ్‌బుక్‌ పాలనలో ప్రజాసంక్షేమానికి చోటేదీ? ●వంచనే చంద్రబాబు ప్రభుత్వ నైజం ●ఆరోగ్య ఆసరా ఇవ్వలేని ప్రభుత్వం ●ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ●ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం

న్యూస్‌రీల్‌

జిల్లా కేంద్రం నుంచి కోటి సంతకాల ప్రతుల తరలింపు పార్వతీపురంలో భారీ ర్యాలీ తరలివచ్చిన నాలుగు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

–10లో
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం

పల్లెలు, పట్టణాల్లోని దేవాలయాలు ధనుర్మాసం పూజలకు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక వెలుగులు పంచనున్నాయి.

కొమరాడ: కూనేరు జీసీసీ డిపోకు వెళ్లి రేషన్‌ తీసుకోవాలంటే ఐదు కిలోమీటర్ల ప్రయాణించాలి... నాగావళి నదిని దాటాలి.. తీరా అక్కడి కి వెళ్లాకు సేల్స్‌మన్‌ రేషన్‌ ఇవ్వడంలేదు... రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.. శనివా రం వస్తే సోమవారం రావాలని చెప్పారు... సోమవారం కూడా రేషన్‌ ఇవ్వకపోవడంతో కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ పరిధిలోని రెబ్బ, వనధార గ్రామాలకు చెందిన 80 కుటుంబాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సేల్స్‌మన్‌ అలసత్వంపై అభ్యంతరం చెబుతూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డీటీ స్పందించి బియ్యం అందజేస్తామని, ఆందోళన విరమించాలని సర్దిచెప్పారు.

పార్వతీపురం: ప్రభుత్వ సేవలను మరింత విస్తృతం చేయాలని జేసీ పి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం, పాలకొండ, సబ్‌కలెక్టర్లు, మండల తహసీల్దార్ల తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యం కొనుగో లు చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్లు ఆర్‌. వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పాల్గొన్నారు.

వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిచ్చింది. కానిస్టేబుల్‌ పోస్టులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 30–11–2022న నోటిఫికేషన్‌ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. అయితే, పోస్టుల భర్తీ తమ ప్రభుత్వమే చేపట్టిందని ప్రచారం చేసుకునేందుకు నియామక పత్రాలను మంగళగిరిలో మంగళవారం అందజేసేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేయించారు. పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్‌ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల్లో రాజధానికి తరలిస్తున్నారు. ప్రచార యావ కోసం ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ కార్యాలయాల్లో అందుకోవాల్సిన నియామక పత్రాలకోసం చలిలో కుటుంబ సభ్యులతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంపై కొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్సిందేనని జనం నినదించారు. వైద్యకళాశాలలు

ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు తాము సైతం అంటూ ముందుకు కదిలారు. సంతకాల ప్రతులతో జిల్లా

కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చేసిన సంతకం ప్రతులను గవర్నర్‌వద్దకు చేర్చే బృహత్తర క్రతువులో భాగస్వాములయ్యారు.

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల పేరుతో ప్రజల అభిప్రాయాలను వైఎస్సార్‌సీపీ సేకరించిన విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా 2 లక్షలకుపైగా సంతకాలను సేకరించి, పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇందులో భాగంగా నాలుగు నియోజకవర్గాల నుంచి వందలాది మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపాన వైఎస్సార్‌ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వెళ్లారు. సంతకాల ప్రతులతో ప్రదర్శనగా సాగారు. ప్రభుత్వ వైద్యకళాశాలలను పరిరక్షించాలని.. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పేదలకు వైద్యాన్ని, వైద్యవిద్యను దూరం చేయ వద్దని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ పెట్రోల్‌ బంకు వద్ద నుంచి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడే మీడియా తో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్ల మెంట్‌ పరిశీలకులు ఎ.చిన్నప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పది మెడికల్‌ కళాశాలల ప్రైవే టీకరణకు సిద్ధమయ్యా రు. అందులో పార్వతీపు రం నియోజకవర్గంలో చేపట్టాల్సిన మెడికల్‌ కాలేజీ కూడా ఉంది. ఇది కుట్రపూరితమైన చర్య. రూ.150 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇచ్చాం. రూ.70 కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మాణాలు కూడా చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు ప్రజల ఆస్తిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఒకటే అడు గుతున్నాం.. రూ.3 లక్షల బడ్జెట్‌ పెట్టి, రూ.లక్షల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబూ.. కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ వైద్యకళాశాలలను పూర్తి చేయలేవా? అంత దయనీ య స్థితిలో ఉన్న చేతకానివారా? ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్‌కు పేదవర్గాల మేలు అవసరం లేదా? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తా పోరాటం చేస్తారు. ప్రభుత్వం మెడలు వంచేదాకా విశ్రమించం.

– అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం

విద్య, వైద్యం, ప్రజారవాణా వ్యవస్థల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించి, మార్గదర్శకంగా నిలవాలి. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని శాసన మండలిలో పలుమార్లు ప్రస్తావించాం. రాష్ట్రంలోని రెడ్‌బుక్‌ పాలనలో ప్రజల సంక్షేమం అవసరం లేదు. ప్రైవేట్‌ వ్యక్తుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది. మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాం. మళ్లీ వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. ప్రజావైద్యం, ప్రభుత్వ వైద్యకళాశాలలను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఈ ఏడాదిన్నర తరహా పాలనను ఎన్నడూ చూడలేదు.

– పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీ

జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఎలా వంచన చేయాలో చూస్తోంది. పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంగా ఎక్కడ చూసినా అవినీతి, కక్షసాధింపులే. – మావుడి శ్రీనివాసరావు,

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ కార్యదర్శి

గత ప్రభుత్వ హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. పీహెచ్‌సీల ఆధునికీకరణతో పాటు, ఏరియా ఆస్పత్రులనూ అప్‌గ్రేడ్‌ చేశాం. అన్ని సౌకర్యాలు కల్పించాం. మందులు అందుబాటులోకి తెచ్చాం. 108 వాహన సేవలను బలోపేతం చేశాం. ఇప్పుడు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని అమలు చేయలేకపోతున్నారు. ప్రజలకు ఆరోగ్య ఆసరా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ఐదు ఐటీడీఏల పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. కేవలం జగన్‌కు పేరు రాకూడదనే ఉద్దేశంతో వీటి నిర్మాణాలను చంద్రబాబు నిలిపివేశారు. వైద్యకళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతన్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ప్రజల ఆకాంక్షలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికై నా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు.

– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే,

పాలకొండ నియోజకవర్గం

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌ప రం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్య మం సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతు గా నిలిచి, సంతకాలు చేశారు. ఈ స్థాయి లో ప్రజా ఉద్యమం చూసినా ప్రభుత్వంలో చలనం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఇప్పుడు మాట తప్పి, దశలవారీగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు.

– శరగడం చినప్పలనాయుడు, పార్లమెంట్‌ పరిశీలకులు

మన్యం జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ వైద్యకళాశాలను తీసుకొచ్చారు. మాకు రాక రాక వచ్చిన వైద్యకళాశాలను ప్రైవేట్‌పరం చేయడమేమిటి? రహదారులను కూడా ప్రైవేట్‌పరం చేస్తారంట. ఇంకెందుకు.. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా ప్రైవేట్‌పరం చేసేయండి. ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకో దు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ను 18వ తేదీన గవర్నర్‌కు అందజేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకుంటుంది.

– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం

కోటి గళాల గర్జన 1
1/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 2
2/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 3
3/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 4
4/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 5
5/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 6
6/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 7
7/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 8
8/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 9
9/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 10
10/11

కోటి గళాల గర్జన

కోటి గళాల గర్జన 11
11/11

కోటి గళాల గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement