ఆధ్యాత్మికం.. ధనుర్మాసం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం

Dec 16 2025 4:22 AM | Updated on Dec 16 2025 4:22 AM

ఆధ్యా

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం

బలిజిపేట: పల్లెలు, పట్టణాల్లో దేవాలయాల ద్వారా ధనుర్మాసంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో నిత్య కై ంకర్య సేవలు, విశేష రోజులు, సేవలు, శ్రీ గోదా రంగనాఽథ స్వామివార్ల కల్యాణం, ప్రత్యేక పాశురాలు, పులకింపజేసే తిరుప్పావై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలతో ధనుర్మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత్ర ప్రీతికరమైనదిగా ప్రాచుర్యం పొందింది. వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. ధనుర్మాసంలో పండగ నెల ప్రారంభం కావడంతో పట్టణ, పల్లె ప్రాంతాలు పరవశిస్తాయి. నెల మొదలైన నాటినుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. హరిదాసు కీర్తనలతో పల్లెలు పులకిస్తాయి.

గొబ్బెమ్మల కొలువు

పండగ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటిముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు.

భోగిభాగ్యాలు

గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తారు. దీంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని భావిస్తారు.

కనుమతో ధనుర్మాసం పూర్తి

కనుమ పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. దీన్నే పశువుల పండుగ అని అంటారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో సాయం చేసిన పశువులకు రైతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే పండగ వాతావరణంతో పల్లెలు కళకళలాడుతాయి.

శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. వేకువనే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. తిరుప్పావై నిర్వహిస్తారు.

సంక్రాంతి..పితృదేవతలకు శాంతి

మకర సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టుకుని తర్పణాలు వదులుతారు. పంచభక్ష్య పరమాణ్నాలతో నైవేద్యం సమర్పించి పెద్దల ఆశీర్వచనం పొందుతారు.

ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు

2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్‌ సేవ(తూమని మాడత్తు)

డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి

(ఉత్తరద్వార దర్శనం)

2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ)

జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి

(అన్జు ఇవ్వులగం)

జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ

(కూడారై వెల్లుం)

జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం

నేటి నుంచి వచ్చేనెల 14వరకు

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం

భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం

సంస్కృతి, సంప్రదాయాలకు

ఆలవాలం

ఎంతో పవిత్రమైనది

ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. శ్రీగోదారంగనాథులను కొలుచుకుని వారి ఆశీస్సులను పొందినవారికి ఎంతోమేలు జరుగుతుంది. అధ్యాత్మికంగా ఈమాసం అందరినీ మేలుకొలుపుతుంది. – సురేష్‌, అర్చకుడు, బలిజిపేట

వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు

శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో నెలరోజులపాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5రోజులు నియమ, నిబంధనలకు సంబంధించిన పాశురాలు. 6వ రోజునుంచి 15 పాశురాలతో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16,17,18పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26పాశురాలలో స్వామికి అలంకారాలైన ఆయుధాలలో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదారంగనాథుల కల్యాణం అట్టహాసంగా నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. గోదాదేవితో కూడుకుని ఉండే నారాయణ అర్చన సేవయే ఈమాసపు ప్రాధాన్యంగా పేరొందిందని, భగవంతుని ఏవిధంగా చేరుకోవాలో తెలిపే మాసం ఇది అని అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈమాసంలో స్వామివారి సేవలో పాల్గొని చూసి, విని తరించాలని అర్చకులు కోరుతున్నారు.

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం1
1/2

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం2
2/2

ఆధ్యాత్మికం.. ధనుర్మాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement