అర్జీలను సొంత సమస్యగా భావించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను సొంత సమస్యగా భావించాలి

Dec 16 2025 4:22 AM | Updated on Dec 16 2025 4:22 AM

అర్జీ

అర్జీలను సొంత సమస్యగా భావించాలి

చికెన్‌

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ128 శ్రీ226 శ్రీ236

చికెన్‌

కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 117 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలను ఆడిట్‌ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డిఆర్‌ఓ కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌లో కూడా కలెక్టర్‌ వినతులను స్వీకరించారు.

వినతులలో కొన్ని..

● పార్వతీపురం మండలం చందలింగి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్‌ 28–5లో గల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆక్రమణ దారుల తొలగించి ఫారెస్టు భూములను కాపాడాలని ఆర్‌.ప్రభాకర్‌ అర్జీ అందజేశారు.

● తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన నిమ్మక వసంతకుమార్‌ వినతిపత్రం అందజేశాడు. .

● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన జి. సత్యం తనకు దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని కోరాడు.

● పార్వతీపురం పట్టణానికి చెందిన సీహెచ్‌. పైడిరాజు గ్యాస్‌ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని నగదు జమ అయ్యేలా చూడాలని వినతిని అందజేశారు.

● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డి. శ్రీరాములు గృహ నిర్మాణం పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 19 వినతులు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ ఏపీఓ ఎస్‌.వి.గణేష్‌ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 19 వినతులు వచ్చాయి. కొండచీపుళ్ల తయారీ యూనిట్‌ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని అడ్డంగి గ్రామస్తుడు గోవిందరావు, మేకల యూనిట్‌ నిర్వహణకు లోన్‌ ఇప్పించాలని ఎం.సింగుపురం గ్రామస్తుడు సింహాచలం అర్జీలు అందజేశారు. జన్నోడుగూడ గ్రామస్తులు అంతర్గత సీసీరోడ్డు గ్రామానికి నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పారదర్శకంగా పరిష్కరించాలి: ఎస్పీ

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 9 అర్జీలను నేరుగా స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఎస్పీ ఆదేశాలను జారీ చేస్తూ ఫిర్యాదుల పూర్వా పరాలను విచారణ చేసి వాస్తవాలైనట్‌లైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అమర జీవికి ఘనంగా నివాళి

ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమర జీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని ఎస్పీ మాధవ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అర్జీలను సొంత సమస్యగా భావించాలి1
1/2

అర్జీలను సొంత సమస్యగా భావించాలి

అర్జీలను సొంత సమస్యగా భావించాలి2
2/2

అర్జీలను సొంత సమస్యగా భావించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement