ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు
పార్వతీపురం: ఆంధ్రరాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయన్నారు. అలాగే, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభాయ్‌పటేల్ వర్ధంతిని పురస్కరిచుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. స్వదేశీ సంస్థానా లను భారతదేశంలో విలీనం చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు.


