ప్రజల ఆకాంక్ష
●కోటి సంతకాలే కాదు..
దేశంలో ఏ రాష్ట్రంలో నూ ఒకే దశలో 17 మెడికల్ కళాశాలల ను తీసుకొచ్చిన పరి స్థితి లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ఆ చరిత్ర సృష్టించారు. అటువంటి కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ ప్రభు త్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ను ప్రజలు చేశారు. జిల్లాలోనూ జగన్ సంకల్పానికి మద్దతుగా 2 లక్షలకుపైగా సంతకాల ను ప్రజలు చేశారు. నేడు ఆరోగ్యశ్రీ.. రోగశ్రీగా మారింది. ఈ రోజు కోటి సంతకాల గర్జనే కాదు.. కోటి గళాల గర్జనగా దీన్ని చూడాలి. గవర్నర్ న్యాయం చేయాలి. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ఇది ప్రజావ్యతిరేక పాలన. రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలవారూ ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేకపోతున్నారు. నేడు 92 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వీరు ప్రజలకు ఏమీ మేలు చేయడం లేదు. ఈ ప్రభుత్వంలో సంపద సృష్టి కాదు.. అప్పులు సృష్టిస్తున్నారు. 18 నెలల కాలంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.
– పీడిక రాజన్నదొర, మాజీ ఉప
ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు
ప్రజారోగ్యం కోసం.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ 17 వైద్యకళాశాలలను తీసుకొచ్చారు. అందులో ఏడు కాలేజీలను గత ఎన్నికలకు ముందే పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రతిదీ ప్రైవేట్‌పరం చేయాలన్నది ఈ ప్రభుత్వ సంకల్పం. ప్రజావైద్యాన్ని ప్రైవేట్‌పరం చేసే కుట్ర. మొత్తం రూ.8,500 కోట్ల ఈ ప్రాజెక్టులో మిగిలిన 10 కళాశాలలకు రూ.5 వేల కోట్లు సరిపోతాయి. అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు.. వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుఠిల నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా, జగన్ సంకల్పానికి మద్దతుగా కోటి సంతకాలను ప్రజలు చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఇది చూసైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. ఆయన మనసు మారాలి.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి
ప్రజల ఆకాంక్ష


