పట్టా ఉన్నా.. సాయం సున్నా..!
డీకేటీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులకు అందని అన్నదాత సుఖీభవ 7 వేల మంది గిరిజన రైతులకు అందని నిధులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులందరికీ నగదు జమ
పోడు వ్యవసాయంలో నిమగ్నమైన గిరిజన రైతులు
అన్నదాత సుఖీభవ జమకాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతులు అందజేస్తున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు అర్హులందరికీ జమ అవుతాయి. ఇప్పటి వరకు 9,500ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమయ్యాయి. ఇంకా 7 వేల మందికి అన్నదాత సుఖీభవ రావాల్సి ఉంది. డీకేటీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతుల భూముల కు ఆధార్ సీడింగ్ లేదు. రాష్ట్రస్థాయిలో ఆప్షన్ ఆగింది. గతంలో నాన్‌వెబ్‌ల్యాండ్ ఆప్షన్ ఉండేది. వ్యవసాయాధికారి, తహసీల్దార్ అప్రూవ్ ఇచ్చేవారు. ఆప్షన్ వచ్చిన వెంటనే సమస్య పరిష్కారమవుతుంది.
– వాహిణి, వ్యవసాయాధికారి, సీతంపేట
సీతంపేట:
గిరిజన రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్రచేసింది. పెట్టుబడి సాయం అందజేయడంలో వివక్ష చూపుతోంది. డీకేటీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులకు అన్నదాత సుఖీభవను అందని ద్రాక్షగా మార్చింది. కొండపోడులో పంటలు సాగుచేసే రైతులకు పెట్టుబడి సాయం అందక ఆందోళన చెందుతున్నారు. ఒక ఏడాది సాయం ఎగ్గొట్టిన ప్రభుత్వం... రెండో ఏడాది అయినా సాయం అందజేస్తుందని ఎదురుచూసిన గిరిజన రైతులకు నిరాశే ఎదురైంది. పెట్టబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతుభరోసా పథకం కింద సాగుసాయం ఠంచన్‌గా ఖాతాల్లో జమయ్యేదని, ప్రస్తు తం ఆ పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. పోడు వ్యవసాయంలో పండించే పైనాపిల్, పసుపు, కొండచీపుర్లు తదితర అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. మరోవైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయమూ అందడంలేదు. అన్నివిధా లా నష్టపోతున్న తమను ఆదుకునే దిక్కులేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
7వేల మందికి అందని సాయం
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16,800ల మంది కొండపోడు పట్టాలు కలిగిన రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు. వైఎస్సార్‌సీపీ హయాంలో 25 వేల ఎకరాల్లో సాగు భూమిపై పూర్తి హక్కులు కల్పించి, సుమారు 17 వేల మందికి పట్టాలు ఇచ్చి రైతు భరోసా నిధులు రూ. 13.500లు జమచేశారు. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500లు కలిపి మొత్తం రూ.13,500ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పటి ప్రభుత్వంలో 7 వేల మందికి పైగా రైతులకు
రెండేళ్లుగా ఎదురుచూపు లే మిగులుతున్నాయి తప్ప ఎటువంటి లబ్ధి కలగడం లేదు. గత వైఎ స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ పెట్టుబడులకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. –ఎస్.వెంకటేష్, ఈతమానుగూడ
గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాంలో ఆర్‌ఓ ఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాదారులకు రైతు భరోసా ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాగును ప్రోత్సహించారు. ఇప్పుటి చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎలా వంచించాలా?అని చూస్తోంది. – విశ్వాసరాయి కళావతి,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే
పట్టా ఉన్నా.. సాయం సున్నా..!
పట్టా ఉన్నా.. సాయం సున్నా..!


