మీ కోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాలు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్‌లో ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీజీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు.
విజయనగరం టౌన్: గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బొబ్బిలి: పట్టణంలో క్రిస్‌మస్ సందడి ప్రారంభమైంది. మెయిన్ రోడ్డు, బజార్‌లోని పలు దుకాణాల వద్ద క్రిస్‌మస్ స్టార్‌లు, ట్రీలు లైటింగ్ డెకరేషన్ల లైట్లు విక్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలు క్రైస్తవ సోదరులు, పిల్లలతో సందడిగా కనిపిస్తున్నాయి. బొబ్బిలిలోని వందేళ్ల పైబడ్డ చరిత్ర ఉన్న స్థానిక సీబీఎం చర్చి రంగులేసుకుని రాత్రి వేళల్లో విద్యుద్దీపాలతో తణుకులీనుతున్న దృశ్యాలు పట్టణంలో కనుల పండువగా కనిపిస్తున్నాయి.
మీ కోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాలు
మీ కోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాలు


