అన్నదాత ఆగ్రహం
తమే. తేమ 17 శాతంలోపు.. మట్టిబెడ్డలు, రాళ్లు 1 శాతంలోపు, అపరిపక్వ, వంకర గింజలు మూడు శాతం, మొలకెత్తిన రంగు మారిన, పురుగు తిన్న గింజలు 5 శాతానికి మించకుండా ఉండాలి. వీటిన్నటింటిపైనా రైతుకు అవగాహన కల్పించేలా ప్రతి మిల్లు వద్ద బోర్డులు ఉండాలి. జిల్లాలోని ఏ మిల్లు వద్ద కూడా ఇవి కానరావడం లేదు.
కొనుగోలు కేంద్రాల సిబ్బంది నేరుగా రైతు కళ్లాం వద్దకే వెళ్లి ధాన్యాన్ని తూకం వేసి, కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నా... మిల్లర్లు మాత్రం ధాన్యం పంపించే రైతు వచ్చే వరకూ వాటిని అన్‌లోడు చేయ డం లేదు. ఎన్ని రోజులైనా మిల్లు వద్ద అలానే ఉంచేస్తున్నారు. మిల్లర్లకు అధికారులు, సిబ్బందే పరోక్షంగా సహకరిస్తే.. రైతు కష్టం ఎవరు వింటారని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో రైస్ మిల్లర్లు ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారే కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధాన్యంలోనే నాణ్యతాలోపం ఉందని, అందుకే కొనుగోలు ధరలు తగ్గుతున్నాయని మిల్లర్ల సంఘం నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ.. తాము చేస్తున్న పనిని సమర్దించుకుంటున్నారు. వాస్తవానికి ఇటీవల సంభవించిన తుఫాన్‌ల వల్ల పంట నష్టాన్ని ఇప్పటికీ అధికారులు, ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మిల్లర్లు మాత్రం తుఫాన్ వల్ల ధాన్యం పాడయ్యాయని, నాణ్యత లేదని సాకులు చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి క్వింటాకు రూ.2,389.. సాధారణ రకానికి రూ.2,369గా నిర్ణయించిన విషయం విది


