● కోటదుర్గమ్మ దేవస్థానం నుంచి ర్యాలీ ● సబ్ కలెక్టర్‌కు
పాలకొండ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం, వివిధ రాజకీయ పక్షాలతో కలిసి పాలకొండలో శుక్రవారం ఆందోళన చేశారు. కోటదుర్గమ్మ దేవస్థానం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని యా లం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌కు తమ సమస్యల తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు, జి.అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది జిల్లాలో లక్ష 70 వేల ఎకరాల్లో దాదాపు 78 వేల మంది రైతులు వరి సాగు చేసినట్లు తెలిపారు. 2 లక్షల 80 వేల టన్నుల ధాన్యం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించాల్సి ఉందన్నారు. రైతు సేవా కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారడంతో రైతులు దగా పడుతున్నట్టు వాపోయారు. నిబంధనలకు విరు
ద్ధంగా జిల్లాలో మిల్లర్ల కనుసన్నల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. మ్లిలర్లు సిండికేట్‌గా మారి క్వింటాకు 5 కేజీలు అదనంగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో రైతులు రమారమి రూ.72 కోట్లు నష్టపోతారన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుంచి అధికంగా ధాన్యం సేకరించినట్లు నిర్ధార ణ అయితే మిల్లులు సీజ్ చేస్తామని స్పష్టం చేశా రు. కార్యక్రమాల్లో వి.అప్పలనాయుడు, వెంకట జగన్నాథం, ద్వారపూడి అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు అల్లు సురేష్‌కుమార్, వారాడ నాగేంద్రనాయుడు, పి. వైకుంఠరావు, రైతులు పాల్గొన్నారు.


