మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పంటను కాపాడుకునేందుకు పరుగులు
న్యూస్‌రీల్
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు
కళ్లాల్లోనే ఖరీఫ్ ధాన్యం
ఆందోళనలో రైతులు
నష్టాలే..
సాక్షి, పార్వతీపురం మన్యం:
వరి పంట కోతకొచ్చిన సమయంలో మోంథా తుపాను కలవరపెట్టింది. చేలను నేలవాల్చి అన్నదాత ఆశలను నేలపాలచేసింది. ఇప్పుడు కోతలు, నూర్పిడిలు చేస్తూ.. పంట విక్రయానికి సిద్ధంగా ఉన్న వేళ.. మరోసారి దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతన్నను వణికిస్తున్నాయి. చాలా చోట్ల వరి పంట కోతలు పూర్తయి ఓవులు(పనల) రూపంలో ఉంది. మరికొన్ని చోట్ల నూర్పిడి చేసి కళ్లాల్లోనే రాశులుగా పోసి ఉంచారు. బస్తాలకు నింపి విక్రయానికి సిద్ధం చేశారు. ఈలోగా తుఫాన్ ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమైంది. సోమ వారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో.. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. టార్పాలిన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు లేకపోవడం.. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యగా టార్పాలి న్లు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వర్షాన్ని బూచిగా చూపి దళారులు, వ్యాపారులు కల్లాల వద్దకు వాలిపోతున్నారు. మద్దతు ధర కంటే బస్తా (80కిలోలు)ను రూ.200 నుంచి రూ.300 తక్కువకు అడుగుతున్నా రు. రైతులు కూడా పంటను కాపాడుకునే పరిస్థితి లేక, వచ్చిన మొత్తానికే విక్రయించుకుంటున్నారు.
5 కేజీలు అదనంగా దోపిడీ..
జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించా రు. ఇప్పటివరకు కేవలం 20 వేల టన్నులు మాత్ర మే కొనుగోలు చేశారు. జిల్లాలో 104 రైస్ మిల్లులు ఉండగా.. బీజీలు ఇవ్వడంలో మిల్లర్లు ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న వరి ధాన్యం పంట నూర్పులు చేస్తూ, అమ్మకానికి రైతన్న సిద్ధమవుతున్నారు. ఒకవైపు వర్షాలు.. వాతావరణ పరిస్థితులు బాగోలేక చేతికి అందిన పంటను అమ్ముకోవాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనను ఆసరాగా చేసుకుని జిల్లాలో ఉన్న మిల్లర్లు, దళారులు అంతా ఒకే మాటపై క్వింటా ధాన్యానికి అదనంగా 5 కేజీలు ధాన్యం ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. దింపుడు కూలి రూ.10 ఇస్తే గానీ మిల్లుకు వచ్చిన ధాన్యం దించబోమని రైతులపై అదనపు భారాన్ని రుద్దుతున్నారు.
ధ్యానం సేకరణ వేగవంతం చేయాలి..
ఓ వైపు వాతావారణం అనుకూలంగా లేదు.. మరో వైపు రైతులను మిల్లర్లు, వ్యాపారులు మోసం చేస్తున్నారు. తక్షణమే రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనా యుడు, అధ్యక్షుడు వెలమల సత్యనారాయణ, సంఘం నాయకులు పోలురోతు చంద్రశేఖర్ కోరారు. సబ్ కలెక్టర్ వైశాలిని కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 5 కేజీల దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుకు అవసరం అయిన అంకెలు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
పాలకొండ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి వరి పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఇంటిళ్ల పాదీ సోమవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకు వరి సంరక్షణ పనుల్లోనే నిమగ్నమయ్యారు. కోసిన చేనును చిన్నచిన్న కుప్పలుగా పెట్టారు. కొన్ని చోట్ల రాశులుగా ఉన్న ధాన్యంను బస్తాల్లోకి ఎత్తి టార్పాలిన్లు కప్పారు. పాలకొండ మండలంలోని లుంబూరు, గరుగుబిల్లి, కోటిపల్లి, భాసూరు, యరకారాయపురం, ఓని తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నూర్పిడి చేయలేకపోయామని, తుఫాన్ వర్షాలకు తడిసి ముద్దయిందంటూ రైతులు వాపోయారు.
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను తుఫాన్ వర్షాలు తడిసిముద్ద చేస్తున్నాయి. కోతకొచ్చే సమయంలో మోంథా తుఫాన్ ముంచేసింది. ఇప్పు డు దిత్వా తుఫాన్‌తో కురుస్తున్న చిరుజల్లులు వరి ఓవులు (పనలను) తడిపేస్తున్నాయి. ఉన్న పంట కాపాడుకుందామన్నా ఒడుపు కుదరడం లేదు. కోతలు పూర్తిచేసి కుప్పలు వేసిన చేను నూర్పిడి చేద్దామంటే ధాన్యం కొనుగోలు జోరుగా సాగడం లేదు. ధాన్యం ఇంటి వద్ద ఉంచే అవకాశం లేదు. మా ప్రాంతంలో దాదాపు 5 వందల ఎకరాల్లో వరిచేను కుప్పల రూపంలోనే ఉంది. మరోవైపు తోటపల్లి కాలువకు నీరు తగ్గించలేదు. తుఫాన్ వర్షాలు, తోటపల్లి కాలువ నీరు పొలాల్లో చేరుతోంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. –ముల్లు గోపాలరావు, రైతు,
పాలకొండ మండలం
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


