చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

చర్యలేవీ?

Dec 2 2025 9:16 AM | Updated on Dec 2 2025 9:16 AM

చర్యలేవీ?

చర్యలేవీ?

మంత్రి కుమారుడు, పీఏపై చర్యలేవీ? పశ్చాతాప్తం లేని మంత్రి మహిళ ఫిర్యాదును పట్టించుకోరా?

బాధిత మహిళకు న్యాయం చేయకుండా.. వేధింపులకు గురి చేస్తారా..?

నిందితులు దర్జాగా తిరుగుతున్నారు..

ఇదేం వివక్ష వైఖరి

చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తాం: ఐద్వా

మంత్రి కుమారుడు, పీఏపై

పార్వతీపురం రూరల్‌: మహిళను లైంగికంగా, మానసికంగా వేధించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు, పీఏ లపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఐద్వా నాయకులు ప్రశ్నించారు. సాలూరుకు చెందిన ఒక మహిళా ఉద్యోగిని.. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆధారాలతో సహా పార్వతీపురం ఏఎస్పీకి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. నిందితులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా చేయలేదని... పైగా ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తిప్పుతూ, తన వ్యక్తిగత సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులు ఈ రకమైన కక్షపూరిత వైఖరి ప్రద ర్శించడం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం (ఐద్వా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.శ్రీదేవి, బి.లక్ష్మి మీడియాతో సోమవా రం మాట్లాడారు. రాష్ట్ర సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత సిబ్బంది, కుమారునిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ.. కనీసం వారిపై చర్యలు చేపట్టక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, ఫిర్యాదు చేసిన మహిళను మాత్రం తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి ఇటీవల చేసిన పత్రిక ప్రకటనలో నిందితులను శిక్షిస్తామని గానీ, జరిగిన తప్పు సరిదిద్దుతామని గానీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించే విధంగా ప్రకటించడంపై ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మహిళలను వేధింపుల కు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో బాధిత మహిళకు మద్దతుగా ఆందోళన చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు ఎం.గౌరమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement