మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారు ‘బాబూ’
గుమ్మలక్ష్మీపురం: మా గ్రామానికి రెండేళ్ల కిందట రోడ్డు మంజూరైంది... రోడ్డు నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేశారు.. ఇప్పటివరకు తిరిగి చేపట్టలేదు.. రోడ్డు ఎప్పుడు వేస్తారో చెప్పండి ‘బాబూ’ అంటూ గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగండ గిరిజనులు సోమవారం ఆందో ళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీ లో తరలించాల్సి వస్తోందని వాపోయారు. అటవీ ఫలసాయాలను సంతకు తరలించాలన్నా, కొనుగో లు చేసిన నిత్యావసర సరుకులు ఇళ్లకు తీసుకెళ్లాల న్నా ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి విజ్ఞప్తి చేస్తే.. ‘నాకు ఓటు వేయలేదు.. రోడ్డు వేయలేనంటూ’ సూటిగా చెప్పడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాధనాన్ని వేతనం రూపంలో తీసుకుని, ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. రోడ్డు వేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి మండంగి సన్యాసిరావు, యువజన సంఘం నాయకులు బిడ్డిక రమేష్, గిరిజనులు పాల్గొన్నారు.


