అక్రమ తవ్వకాలు వాస్తవమే
కొత్తవలస: మండలంలో సర్వే నంబర్ 168లో గల ఫిరంగి కొండ వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతుండడం వాస్తవమేనని తహసీల్దార్ పి.సునీత స్పంష్టం చేశారు. సాక్షి దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కొండ’ పై అక్రమార్కుల ‘ఫిరంగి’ అనే కథనానికి రెవెన్యూ అదికారులు ఆగమేఘాలపై స్పందించారు.అక్రమ తవ్వకాల ప్రాంతంలో రెవన్యూ ఇన్‌స్పెక్టర్ షణ్ముఖరావు, వీఆర్‌ఓ ఆర్.రాధాకృష్ణతో పాటు మరికొంతమంది రెవెన్యూ సిబ్బంది సోమవారం విచారణ చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయాల్లో ముఖ్యంగా సెలవుదినాల్లో తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు చెప్పారని తహసీల్దార్ సునీత తెలిపారు.ఈ తవ్వకాల వల్ల రెండు జీడిచెట్లు, ఒక తుమ్మచెట్టు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. తవ్వకాలను నిరోధించేందుకు ఆప్రాంతంలో వాహనాలు వెళ్లకుండా ఉండే విధంగా పెద్ద కందకం జేసీబీతో తవ్వించినట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మేర తవ్వకాలు జరిగాయో గుర్తించాలని మైనింగ్ శాఖ అధికారులకు లేఖ పంపించినట్లు చెప్పారు. రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు జరిపిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరంగి కొండ, గ్రేహౌండ్స్‌కు కేటాయించిన ప్రాంతంలో ప్రత్యేకించి ఇద్దరు వీఆర్‌ఏలను కాపలా నియమించినట్లు ఆమె తెలిపారు.
తహసీల్దార్ పి.సునీత
సాక్షి కథనంపై స్పందించిన రెవెన్యూ అదికారులు
ఆక్రమార్కులను గుర్తించాలని
పోలీసులకు ఫిర్యాదు
అక్రమ తవ్వకాలు వాస్తవమే


