ప్రపంచంలోనే అతిగొప్పది భారత రాజ్యాంగం
● జేసీ సేతుమాధవన్
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిగొప్పదని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు. విజేతలైన 13 మందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జేసీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపికై న మరో 8 మంది జిల్లా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు, అధికారులు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
భారత సార్వభౌమాధికారానికి ప్రతీక మన రాజ్యాంగం
విజయనగరం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశాక దేశ ప్రజల కోసం చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు, ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు అవసరమైన పవిత్ర గ్రంథాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే జయమణి, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జైహింద్‌కుమార్, ఈశ్వరరావు, రామారావు, కిశోర్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిగొప్పది భారత రాజ్యాంగం
ప్రపంచంలోనే అతిగొప్పది భారత రాజ్యాంగం


