తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్ట్
బాడంగి: మద్యం వ్యసనానికి బానిసైన బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన మామి డిరాము మద్యంకోసం డబ్బులివ్వాలని గొడవపడి విచక్షణారహితంగా కన్నతండ్రి సత్యం తలనరికి హత్యచేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి చెప్పారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రామను అరెస్ట్‌చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కు తరలించేముందు విలేకరులకు వివరాలు తెలి యజేశారు. తరచూ మందు కొనుగోలుకు డబ్బులివ్వాలనిభార్య, తల్లితో గొడవపడి కొట్టేవాడని ఈనెల 1వతేదీన సాయంత్రం 4గంటల సమయంలో కత్తితో ఇంటిలో భార్యను కొడుతుండగా తండ్రి పక్షవాతంతో మంచంమీదనుంచి లేవలేక పారిపోమని సైగలుచేసి బయటకు పంపివేయగా ఆ కసితో మంచంపై ఉన్న తండ్రిని మాంసంకోసే కత్తితో తలనరికి మొండెం నుంచి వేరుచేసి గమేలాలో వేసి పారిపోయాడని చెప్పారు. నిందితుడిని కామన్నవలస జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో బొబ్బిలి రూరల్‌సీఐ నారాయణరావు, ఎస్సై తారకేశ్వరరావు మంచి ప్రతిభను కన బరిచారంటూ వారిని అభినందించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
