
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
విజయనగరం రూరల్: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు లు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షు లు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంథకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖః సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండగని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.