
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజలందరూ ఆనందాల దీపావళి జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి అని ఈ శుభ సదర్భంగా జిల్లాలోని ప్రతి ఇంట్లో సంతోషాన్ని సంపదను, సుఖశాంతులను నింపాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
నేడు గ్రీవెన్స్‌సెల్ రద్దు
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో, ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. ఆపై సోమవారం నుంచి యథావిధిగా పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నామని ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు.
పిడుగుపాటుతో ఆవు మృతి
తెర్లాం: మండలంలోని కవిరాయునివలస పంచాయతీ పరిధి బొంగుపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఓ పాడిఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు మరిశర్ల ఆదినారాయణ తన ఆవును మేత కోసం పొలంలోకి ఆదివారం సాయంత్రం తొలుకుని వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి ఒక్కసారిగా ఆవు మేస్తున్న ప్రదేశంలో పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగుపాటుకు గురై పాడిఆవు మృతి చెందడంతో ఆదినారాయణ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.
రైలు ఢీకొని యువకుడి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని నడబంద పరిధిలో ఆదివారం తె ల్లవారు జాము సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంపై స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతనాపల్లి గ్రామానికి చెందిన పూడి గణేష్(30) శనివారం రాత్రి ఎస్.కోటలో ఉన్నాడు. గణేష్ తెల్లవారుజామున 4గంటల సమయంలో నడబంద సమీపంలో ఉన్న రైల్వేట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టగా గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ ఎస్సై బాలాజీ ఆదేశాలతో హెడ్‌కానిస్టేబుల్ వి.నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● పిండిలా మారిన మాత్రలు
● అవాక్కయిన రోగి
విజయనగరంఫోర్ట్: ఈ ఫొటోలోని స్ట్రిప్‌లో పిండిలా ఉన్న మాత్రలు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లిన రోగికి ఇచ్చినవి. మెడనొప్పి ఉండడంతో గంట్యాడ మండలంకు చెందిన సీహెచ్. బాల అనే రోగి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి శనివారం వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మందులు రాసి ఫార్మసీలో తీసుకోమని చెప్పారు. అక్కడ మందులు తీసుకుని ఇంటికి వెళ్లి వాటిని తెరిచి చూడగా అమిట్రాపిన్ అనే మాత్రలు పిండిలా ముద్దయిపోయాయి. దీంతో వాటిని వేసుకోకుండా వదిలేసింది. ప్రజల ఆరోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కూటమి సర్కార్ రోగులకు నాణ్యత లేని మందులు సరఫరా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని మందులు వేసుకుంటే తమ ప్రాణాలకు ఏమోవుతుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. పేద ప్రజలు ఎక్కువగా చికిత్స పొందే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు నాణ్యత లేని మందులు సరఫరా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు