
లొద్ద జలపాతం అభివృద్ధి చేస్తా
సాలూరు: కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదివారం సాలూరు మండలంలోని లొద్ద ప్రాంత గిరిజనుల గూడాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా తీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహాలు లేని వారందరికీ గృహాలను మంజూరుచేస్తానని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు గిరిజనులు మారుపేరని కితాబిచ్చారు. అనంతరం అతికష్టంమీద కొంతదూరం అటవీమార్గంగుండా కాలినడకన లొద్ద జలపాతానికి వెళ్లిన కలెక్టర్ ఆ జలపాతాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఇటువంటి సుందరమైన ప్రాంతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారాలని ఆకాంక్షించారు. లొద్ద జలపాతానికి పర్యాటకులు వచ్చేలా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ ప్రసూన, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

లొద్ద జలపాతం అభివృద్ధి చేస్తా