
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ నూతన కమిటీ ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంఽధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసి యేషన్(ఏపీఆర్‌ఎస్‌ఏ) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా యూనిట్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆదివారం పార్వతీపురంలో ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాలతో, ఎన్నికల అధికారిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, సహాయ ఎన్నికల అధికారిగా బీవీవీ ఎన్.రాజు, పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు వ్యవహరించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా కలెక్టరేట్ ఈఎఫ్‌జీ సెక్షన్ పర్యవేక్షకుడు గొట్టాపు శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వీరఘట్టం తహసీల్దార్ ఎ.సాయి కామేశ్వరరావు, కోశాధికారిగా కలెక్టరేట్ సి.సెక్షన్ పర్యవేక్షకురాలు పి.సత్యలక్ష్మి కుమార్ ఎంపికయ్యారు.
నూతన కార్యవర్గంలో ముఖ్యలు వీరే..
సహాధ్యక్షులుగా పాలకొండ తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎన్.శివన్నారాయణ(తహసీల్దార్, భామిని), పి. చిట్టెమ్మ(రీ–సర్వే ఉప తహసీల్దార్, సీతానగరం), ఎన్.శ్రీనుబాబు(ఆర్‌ఐ, సీతానగరం) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు (ఉపతహసీల్దార్, బలిజిపేట), క్రీడలు– సాంస్కృతిక కార్యదర్శిగా బి.శివరామకృష్ణ(ఆర్‌ఐ, గుమ్మలక్ష్మీపురం) బాధ్యతలు చేపట్టనున్నారు. వారితో పాటు పలువురు సంయుక్త కార్యదర్శులు, ఈసీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.