
సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు యూనివర్సిటీ జట్టులో స్
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాల కబడ్డీ టోర్నమెంట్ – 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు నలుగురు యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాబోయే దక్షణ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయ తరఫున పోటీపడనున్నారు. ఎంపికై న విద్యార్థులలో శ్రీవల్లి, రమ్య, నీలిమ, వరలక్ష్మి ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయి దేవ మణి తెలిపారు. అలాగే జూడే విభాగంలో జరిగిన అంతర్ కళాశాల పోటీల్లో ప్రధమ స్థానం సాధించిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి హేమంత్ సౌత్ జోన్ జూడో చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శిశభూషణరావు, ఫిజికల్ డైరెక్టర్ ఎస్‌హెచ్ ప్రసాద్ అభినందించారు.