
23న పీడీఎస్‌వో జిల్లా మహాసభలు
పార్వతీపురం: పీడీఎస్‌వో జిల్లా మహసభలు ఈ నెల 23న పార్వతీపురంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు కె.సోమేష్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహాసభలకు సంబంధించి పోస్టర్‌ను సోమేష్‌తో కలిసి సంఘ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వున్న సమస్యలను పరిష్కరించాలని, గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు, పీడీఎస్‌వో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కరరావు, ఎన్‌వైఎస్ జిల్లా నాయకులు పీడిక అసిరి తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.