
మన్యంపై జ్వరాల పంజా
మన్యంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జ్వరాలు, కామెర్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మలేరియాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రికి రిఫరల్స్ అధికమవుతున్నాయి. ప్రధానంగా జిల్లా ఆస్పత్రిలో వార్డులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో వివిధ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రధానంగా అన్నిచోట్లా దసరా సెలవుల అనంతరం ఇళ్లకు వెళ్లి వచ్చిన విద్యార్థులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నీరు మారడం ఇందుకు కారణమని ఉపాధ్యాయులు అంటున్నారు. సాలూరు సీహెచ్‌సీలో 21 మందికిపైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో పచ్చకామెర్లు, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎర్రసామంతవలస, మామిడిపల్లి విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. సాలూరు మండలంలోని బొడ్డవలస బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామెర్లతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో కురుపాం ఆశ్రమ, ఏకలవ్య పాఠశాలతో పాటు.. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, ఇతర ప్రాంతాల గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ప్రతి రోజూ చేరుతూనే ఉన్నారు. ఇందులో కురుపాం విద్యార్థులే 24 మంది వరకు ఉన్నారు. ఓవైపు డిశ్చార్జిలు అవుతున్నా.. మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ అధికంగా ఉంటున్నారు.
– సాక్షి, పార్వతీపురం మన్యం
రోజురోజుకూ పెరుగుతున్న జ్వర పీడితులు
మలేరియా, కామెర్ల బారిన చిన్నారులు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

మన్యంపై జ్వరాల పంజా

మన్యంపై జ్వరాల పంజా

మన్యంపై జ్వరాల పంజా

మన్యంపై జ్వరాల పంజా