
● పక్కపక్కనే...
చిత్రంలో కనిపిస్తున్నవి ఆంధ్రా–ఒడిశా అంతర్‌రాష్ట్ర రహదారిపై బొబ్బిలి ఫ్లై ఓవర్‌కు వందమీటర్ల లోపల ఏర్పాటుచేసిన బాణ సంచా విక్రయ దుకాణాలు. వీటికి సమీపంలో ఆస్పత్రులు, ఆలయాలు, పాఠశాలలు ఉన్నాయి. ఇంకా అధికారులు అనుమతులు ఇవ్వకుండా... దుకాణాల మధ్య కనీస దూరం (20 అడుగులు) పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అధికారుల నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. – బొబ్బిలి