
నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు
● అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి
విజయనగరం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 225 దుకాణాలు, 26 బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడ నకిలీ మద్యం దాఖలాలు కనిపించ లేదన్నారు. లైసెన్‌న్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాలు, బార్లు, ఇన్ హౌస్ సంస్థల కార్యకలాపాలను, అలాగే నాణ్యమైన, సురక్షితమైన మద్యం మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో నిర్ధారణకాని, అక్రమంగా తయారైన మద్యం చలామణి జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు చేపట్టి మద్యం దుకాణాల్లో సహకరించిన నమూనాలను ల్యాబ్ లకు పంపించి నిర్ధారణ చేసుకోనున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. శ్రీనాథుడు, తదితరులు పాల్గొన్నారు.