
కూటమి నాయకుల కబ్జా
● కో–అపరేటివ్ బ్యాంకు స్థలం అక్రమణ
● ఫిర్యాదు చేసిన ఎంపీపీ, సర్పంచ్
కొమరాడ: మండలంలోని మాదలింగి పంచాయతీ అధీనంలో ఉన్న స్థలంపై కూటమి నాయకుల కన్ను పడింది. అదును చూసి చదును చేసి తమ అనచరులకు పప్పు బెల్లంలా పంచి పెట్టేశారు. అధికార బలంతో కూటమి నాయకులు చేస్తున్న అక్రమణలపై ఎంపీపీ శెట్టి. శ్యామల, సర్పంచ్ తుమరాడ కళావతి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల క్రితం ప్రాథమిక సహకర కో–అపరేటివ్ భవనం నిర్మాణం చేసి ఆ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు అందించేవారు. కొన్నాళ్ల క్రితం ఆ సొసైటీ బ్యాంకును కొమరాడ పీఏసీఎస్‌లో విలీనం చేయడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పాడైన భవనాన్ని కూలగొట్టి చదును చేశారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆక్రమణదారులను తొలగించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కూటమి నాయకుల కబ్జా