
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని విజ్జి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలకు అవకాశం కల్పించగా.. జిల్లా నలుమూలల నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పడగల కనిష్(ఫైల్), ఎం.డి షేక్ అహ్మద్ (ఫైల్), జె.శ్యాం శశాంక్ (ఫైల్), ఎన్‌ఎం జితేంద్ర (ఫైల్), బి .హర్షవర్ధన్ (ఇప్పి), బి.ఆదిత్య వర్ధన్ (సేబర్), పి.శారద (ఫైల్), బి.హన్సి శ్రీవల్లి (సేబర్) విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18న కాకినాడలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చీఫ్ కోచ్ డీవీ చారి తెలిపారు. ఈ ఎంపికపోటీలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుంకర సతీష్‌కుమార్, వ్యాయామ అధ్యాపకురాలు సౌదామిని ,ఎన్‌ఐఎస్ కోచ్ అప్పలరాజులు పర్యవేక్షించారు.