
పార్వతీపురం మన్యం
న్యూస్‌రీల్
పత్రికా స్వేచ్ఛను హరించడం సిగ్గుసిగ్గు
‘సాక్షి’పై అక్కసు ఎందుకు బాబూ..?
జర్నలిస్టులపై అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళన
ప్రజాపక్షంగా వార్తలు రాస్తున్న పత్రికల గొంతునొక్కడం తగదు
‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి
నోటీసులు ఇవ్వడంపై నిరసన
దాడులు ఆపకపోతే అసెంబ్లీని
ముట్టడిస్తామని హెచ్చరిక
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
9
పాలకొండ/పాలకొండరూరల్/కురుపాం/విజయనగరం అర్బన్: ప్రజాపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనా యించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను నెరిపే ప్రయత్నమని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాపై అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి పదేపదే నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాపక్షంగా నిలిచే పత్రికల గొంతు నొక్కేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. వార్త లు సహేతుకంగా లేవని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య పద్ధతి అని, ప్రభు త్వం ఆ మార్గాన్ని పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో జర్నలిస్టులమంతా సంఘటితమై అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ విజయనగరంలోని జర్నలిస్టులు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. సాక్షి బ్యూరో చీఫ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నా యకులు పీవీ శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో, సీనియర్ జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు.
●కూటమి ప్రభుత్వం ప్రజాసామ్యంపై దాడిచేస్తోందని పత్రిక, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై కేసు లు బనాయించడంపై నిరసన తెలిపారు. పాలకొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ధ ధర్నాచేశారు. జర్నలిస్టులకు నోటీసులు జారీ చేయడాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ప్రెస్ క్లబ్ సభ్యుడు బత్తుల వెంకటరమణ, జొన్నగడ్డల కామేశ్వరావు, ఆటో యూనియ న్ నాయకుల కాద రాములు తప్పుబట్టారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధి తిర్లంగి ఉపేంద్రకుమార్, ప్రెస్‌క్లబ్ నాయ కులు శివకుమార్, కె.వి.రమణ, కల్యాణ్‌కుమార్, ఈశ్వరరావు, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
●పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ తహసీల్దార్ జయకు కురుపాం నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులు కె.చంద్రమౌళి, ఢిల్లేశ్వరరావు, జి.పెంటయ్య, ఫృధ్వి, లక్ష్మణరావు, రంగనాథం తదితరులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదన్నారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులను వెనుకకు తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నిరసిస్తూ జర్నలిస్టుల సంఘాల
ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన
కురుపాంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

పార్వతీపురం మన్యం