
●తప్పుడు కేసులు సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు. పత్రికా ప్రతినిధులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించి, కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది.
– బి.వి.రమణ, పాలకొండ ప్రెస్‌క్లబ్ సభ్యుడు
కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో పత్రి కా స్వేచ్ఛను హరిస్తోంది. అజమాయిషీ చెలాయిస్తోంది. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే పత్రికలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. ఇది అమానుషం.
– జె కామేశ్వరరావు,
పాలకొండ ప్రెస్‌క్లబ్ గౌరవాధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం పోలీసులను పావులుగా వాడుతోంది. ప్రజాస్వామ్యంలో అక్రమాలను వెలికితీసే బాధ్యత, హక్కు పత్రికలకు ఉంది. ‘సాక్షి’పై జరుగుతున్న దాడుల ను వెంటనే నిలిపివేయాలి.
–డి.రమణారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికితీయడం తప్పా?. వాస్తవాలు రాస్తే భయమెందుకు?. పత్రికలపై దాడిచేయడం తగదు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. – కె.సూర్యప్రకాష్‌రావు, న్యాయవాది

●తప్పుడు కేసులు సరికాదు

●తప్పుడు కేసులు సరికాదు

●తప్పుడు కేసులు సరికాదు