
తప్పుడు ప్రచారం చేశారు
పచ్చకమెర్లతో విద్యార్థిను లు మృతిచెందితే సరైన వైద్యం చేయించుకోలేదని, నాటువైద్యం చేయించుకోవ డం వల్ల మృతిచెందారంటూ అధికారులతో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల పాలనా కాలంలో 15 మంది విద్యార్థులు మృతిచెందారు. అందులో నెలరోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత మండలంలో ముగ్గురు విద్యార్థులు, సొంత నియోజకవర్గానికి చెందిన మరో ఇరువురు విద్యార్థులు కలి పి ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికై నా
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరవాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలి. –పీడిక రాజన్నదొర,
మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి