
పూరిల్లు దగ్ధం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన బొమ్మరిల్లు రాజారావు పూరిల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రాజారావు కోరుతున్నాడు.
హెచ్‌ఐవీ రొగులకు శస్త్ర చికిత్సలు
● స్పందించిన సర్వజన ఆస్పత్రి
వైద్యాధికారులు
విజయనగరంఫోర్ట్: హెచ్‌ఐవీ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం లేదనే అంశంపై సాక్షిలో ఈనెల 14వతేదీన హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు.

పూరిల్లు దగ్ధం