
2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.58 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా చేసుకున్నామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎం.బాలసరస్వతి తెలిపారు. ఈ మేరకు గురువారం వీరఘ ట్టం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 356 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయని, వాటి పరిధిలో 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్నారు. ఇప్పటికే 104 మంది మిల్లర్లు ధాన్యం మర పట్టించేందుకు సముఖత చూపారని తెలిపారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కొద్ది రో జుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాటు చేయాలి
పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సీజన్‌లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రవాణా, గోనెసంచులు వంటివి సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ గత
అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,369, గ్రేడ్ ఎ రకానికి రూ. 2,389 మద్దతు ధర ప్రకటించిందని, 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం