
రహదారులపై చెత్త కనిపించరాదు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: పార్వతీపురం, సాలూరు పట్టణంలోని రహదారులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా చెత్త కనిపించరాదని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వార్డులో పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని, పరిపాలనలో పూర్తిస్థాయి ‘ఈ–ఆఫీసు’ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలని ఆదేశించారు.
● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ
విజయనగరం ఫోర్ట్: అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే సీపీఆర్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయినప్పడు అతని ప్రాణాలు రక్షించడానికి సీపీఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ జయధీర్‌బాబు, అత్యవసర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ శివప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.