
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి
● గాలింపు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట గెడ్డలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్‌లోని ఓ కిరాణా హోల్‌సేల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత వసంత గ్రామానికి ముందు ఉన్న గెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. రాత్రి 12 గంటలైనా సోమరాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ స్తులతో కలిసి వెతకసాగారు. తెల్లవార్లూ వెతికినా అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. గల్లంతైన సోమరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెడ్డపై ఇప్పటికై నా పాలకులు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి