
సుజుకి నూతన షోరూం ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డులో వేణుగోపాల్ సుజుకి సంస్థ తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. మంగళవారం ఈ కొత్త శాఖను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెడ్ అభిషేక్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని, ఉత్తమమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వేణుగోపాల్ సుజుకి సంస్థ విజయనగరంలో ఇప్పటికే ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తోందని, వినియోగదారుల మద్దతుతో రెండో షోరూం ప్రారంభించడం ఆనందకరమ న్నారు. కార్యక్రమంలో బెస్ట్ వాల్యూ ఎస్‌ఎంఐపీఎల్ ఆపరేషన్స్ హెడ్ వీఎస్.యాస్ పాల్, వేణుగోపాల్ సుజుకి ఎండి జి.అభిరామ్, జీఎం సీహెచ్.ప్రవీణ్ కుమార్, సర్వీస్ మేనేజర్ సంతోష్ వర్మ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎన్.సురేంద్ర, ఏరియా సర్వీస్ మేనేజర్ వి.సాయి కౌటిన్య తదితరులు పాల్గొన్నారు.