విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
19న జిల్లా స్థాయి యోగాసనాల పోటీలు
నెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి యోగసనాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా క్రీడా సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మొత్తం ఏడు విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలను 25, 26వ తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను 17వ తేదీలోగా ఫోన్ నంబర్లు 8374904262, 8465954998 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు.