
మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
సాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బొబ్బిలి మండలం కృపావలస గ్రామానికి చెందిన చెందిన విద్యార్థిని తాడంగి పల్లవి (12) మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లివి దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వెళ్లింది. అనారోగ్యంతో బొబ్బిలి ఆస్పత్రిలో ఈ నెల 6వ తేదీన చేరగా అక్కడ నుంచి 8వ తేదీన విజయనగరం ఘోషా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 11వ తేదీన విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా ఈ నెల 12వ తేదీన మృతిచెందింది. మెదడు వాపు వ్యాధితో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు గిరిజన సంక్షేమ సహాయ అధికారి కృష్ణవేణి తెలిపారు.