
● జీతాలందక అవస్థలు
● కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆరోగ్యమిత్రలు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు ఇప్పించాలని పలువురు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రల సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో సిబ్బంది కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైడపునాయుడు, మహేష్, బంగారునాయు డు, జగదీష్, రాజప్పడు, తదితరులు పాల్గొన్నారు.